బోరబండను మరింత అభివృద్ధి చేస్తాం: బాబా ఫసియుద్దీన్

125
Deputy Mayor Baba Fasiuddin

డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ఆదివారం బోరబండలో ప్రతి వార్డులో జరిగే టిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవలే మరణించిన కేంద్ర క్యాబినెట్ మంత్రిగా పని చేసిన రాంవిలాస్ పాశ్వాన్ చిత్ర పటానికి నివాళులు అర్పించారు. అలాగే సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులులై బహుజన వాదులు తమ కుల వృత్తి రూపంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ.. ఇప్పటి టిఆర్ఎస్ చేపట్టినటువంటి సంక్షేమ పథకాలను ప్రతి గడపగడపకి వెళ్లి వివరిస్తామన్నారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సహకారంతో రాబోయే రోజుల్లో బోరబండను మరింత అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తానని డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ తెలిపారు.