ఓటీటీలోకి వచ్చేసిన ‘బాక్’!

16
- Advertisement -

అత్యంత విజయవంతమైన హారర్ కామెడీ సిరీస్ ‘అరణ్మనై’ నుంచి నాల్గవ చిత్రం అరణ్మనై 4 తెలుగులో ‘బాక్’ పేరుతో వచ్చిన సంగతి తెలిసిందే. సుందర్ సి దర్శకత్వంతో పాటు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, రాశి ఖన్నా హీరోయిన్స్. మే 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఆకట్టుకుంది.

తాజాగా ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో ఓటిటి ఎంట్రీకి వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ సంస్థ డిస్నీ + హాట్ స్టార్ వారు సొంతం చేసుకోగా ఇందులో ఈ చిత్రం నేటి నుంచి స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించగా ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ LLP తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు.

Also Read:నిద్రలో గుండెపోటు..జాగ్రత్తలివే!

- Advertisement -