పంచెకట్టులో మెరిసిన జక్కన్న..

349
prabhas

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి లండన్‌లో పంచెకట్టుతో ఆకట్టుకున్నారు. లండన్‌లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ లో దాదాపు 5 వేల మందికి పైగా ప్రేక్షకుల ముందు ‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమాను ప్రదర్శించారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు కీరవాణి ప్రదర్శన కూడా అత్యంత వైభవంగా జరిగింది.

bahubali-london

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బాహుబలి నటీ నటులు ప్రభాస్, రానా, అనుష్కలతో పాటు నిర్మాత శోభు యార్లగడ్డ కూడా హాజరయ్యారు. అక్కడ వీరు దిగిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక్కడ సినిమాను చూడాలని జపాన్ నుంచి లండన్ వరకూ కొంతమంది అమ్మాయిలు రావడం గమనార్హం. వారంతా రాజమౌళితో ఫోటోలు దిగడానికి ఆసక్తిని చూపారు.

rajamouli

జానపద కథతో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి రెండు భాగాలుగా విడుదలై ఘనవిజయం సాధించింది. తొలి భాగం 500 కోట్ల వరకు వసూళ్లు సాధించగా రెండో భాగం ఏకంగా 1800 కోట్ల వసూళ్లు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ సినిమాను దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు సమర్పణలో శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేనిలు సంయుక్తంగా నిర్మించారు.