లండన్‌లో బాహుబలి స్టార్స్‌..!

388
baahubali stars

బాహుబలితో తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పాడు దర్శకధీరుడు రాజమౌళి. ఈ సినిమాతో ప్రభాస్‌కు జాతీయ స్ధాయిలో మంచి గుర్తింపు వచ్చింది. ఈ నేపథ్యంలో లండన్‌లోని ప్రతిష్టాత్మక ఆల్బర్ట్‌ హాల్‌లో జరగనున్న బాహుబలి ది బిగినింగ్‌ ప్రదర్శనలో పాల్గొనేందుకు ప్రభాస్‌, రానా దగ్గుబాటి, అనుష్క, శోభు యార్లగడ్డలు లండన్‌ చేరుకున్నారు.

అంతా కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించి సందడి చేశారు.రాజమౌళితో పాటు చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ, ప్రభాస్‌, అనుష్క, రానా కలిసి ఫోటోలకు ఫోజుఇచ్చారు. వీరితో పాటు సినిమా సాంకేతికవర్గం కూడా ఈ ప్రదర్శనకు హాజరుకాగా వీరంతా కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

నాలుగేళ్ల పాటు రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. తొలి భాగం 500 కోట్లు, రెండో భాగం ఏకంగా 1800 కోట్ల వసూళ్లు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. రాఘవేంద్రరావు సమర్పణలో శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేనిలు సంయుక్తంగా నిర్మించారు.