బాహుబలికి పెళ్లి కుదిరిందా..?

245
- Advertisement -

బాహుబలి తరువాత సుజిత్ డైరెక్షన్ లో సాహో లో ప్రభాస్ నటిస్తున్నాడనే విషయం తెలిసిందే. అయితే బాహుబలి తర్వత ప్రభాస్ విదేశాల్లోనే ఎక్కువగా గడిపాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత ‘సాహో’ సినిమా షూటింగులో పాల్గొంటాడని అన్నారు. మరి ఈ సినిమా షూటింగ్ అయితే మొదలైంది కానీ, ప్రభాస్ జాయిన్ అయ్యాడా లేదా అనే విషయం మాత్రం తెలియడం లేదు. ప్రభాస్ ఇప్పుడు ఏం చేస్తున్నాడనేదే టాలీవుడ్ లో మిలియన్ డాలర్స్ క్వశ్చిన్ గా మారింది.

'Baahubali' star Prabhas getting married?

బాహుబలిలో ప్రభాస్ తో పాటు నటించిన రానా అనుష్క తమన్నా ఈ సినిమా రిలీజ్ కాకుండానే వేరే సినిమాల్లో నటించారు. ఇప్పుడు కూడా తమ పర్సనల్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. అంతేకాదు అడపదడప ఫంక్షన్స్ – ప్రెస్ మీట్స్ లో తళ్ళుక్కు మంటున్నారు. రానా అయితే ఏకంగా ఓ టీవీ షోకి హోస్ట్ గా వర్క్ చేస్తున్నాడు. అయితే ఈ బ్యాచ్ కే కాదు అస్సలు సినిమా వాళ్లకే ప్రభాస్ దూరంగా ఉంటున్నాడని వినిపిస్తుంది. బాహుబలి తరువాత పెళ్లి చేసుకుంటా అంటూ గతంలో పరోక్షంగా తన మనసులోని మాటను బయటపెట్టిన ప్రభాస్ ప్రస్తుతం ఆ పనిలోనే తలమునకలైనట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.

ప్రభాస్ కు తగిన జోడీని వెతికేందుకు తన ఫ్యామిలీ మెంబర్స్ రంగంలోకి దిగినట్లు తెలిసింది. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ చూస్తోన్న సంబంధాల్లో ఒకటి త్వరలోనే ఫైనలైజ్ కావొచ్చని చెప్పుకుంటున్నారు . త్వరలోనే ఈ విషయం పై అధికారిక ప్రకటణ కూడా వచ్చే అవకాశం ఉందట. మరి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ డార్లింగ్ ప్రభాస్ ను పెళ్లాడబోతున్న ఆ లక్కీ లేడీ ఎవరో వేచి చూడాలి.

- Advertisement -