తెలుగు సినిమా స్ధాయిని ప్రపంచానికి చాటిచెప్పిన చిత్రం బాహుబలి. విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం టాలీవుడే కాదు భారత చలనచిత్ర రంగంలోని రికార్డులను తిరగరాసింది. బాహుబలి ముందు తర్వాత అనేలా చలనచిత్ర రంగాన్ని చెప్పుకునే స్ధాయిలో రికార్డులు సృష్టిస్తోంది. సినిమా విడుదలై రెండు సంవత్సరాలు కావొస్తున్న బాహుబలి సునామీ మాత్రం ఆగట్లేదు. సోషల్ మీడియాలో సైతం బాహుబలి సునామీ రికార్డులు బద్దలవుతున్నాయి.
తాజాగా వికీపీడియా 2017లో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది చదివిన ఆర్టికల్స్‌కి సంబంధించిన జాబితాని విడుదల చేసింది. 1.46 కోట్ల వ్యూస్‌తో ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ పదకొండో స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇందులో ‘డెత్స్ ఇన్ 2017’ 3.73 కోట్ల వ్యూస్‌తో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు ‘డొనాల్డ్ ట్రంప్’ పేరు ఉండగా, ఆయన వికీపీడియా ప్రొఫైల్‌ను 2.96 కోట్ల మంది చూశారు. 1.92 కోట్ల వ్యూస్‌తో ‘ఎలిజబెత్ 2’ మూడో స్థానంలో, 1.87 కోట్ల వ్యూస్‌తో ‘గేమ్స్ ఆఫ్ థ్రోన్’ (సీజన్ 7) నాలుగో స్థానంలో ఉంది.
ఇప్పటి వరకు దాదాపు 1700 కోట్ల వసూళ్లు కొల్లగొట్టిన బాహుబలి 2 మూవీ త్వరలో చైనా, జపాన్‌లలో విడుదల కానుంది.హాలీవుడ్ లో పాపులర్ వెబ్ సైట్ అయిన రొటెన్ టమాటాస్ 2017 లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన వేలాది సినిమాల్లో టాప్ 10 లిస్ట్ ఎంపిక చేసింది. ఇందులో బాహుబలికి రెండోస్థానం దక్కింది.