బాహుబలి సినిమా తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ ఏ రేంజ్‌లో పాపులర్ అయ్యాడో వేరే చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ డార్లింగ్ గురించే చర్చ. ఇక యూత్ లో ప్రభాస్ కు ఉన్న భారీ ఫాలోయింగ్ తో ప్రభాస్ కు సంబంధించిన చిన్న వార్త కూడా ఇప్పడు క్రేజీ న్యూస్ గానే తయారైంది. ఇక ఇదే ఈ క్రమంలో ఈ రెబల్ స్టార్ కు సంబంధించి వ్యక్తిగత అంశాలపై ఓ పత్రికలో ఆసక్తికరమైన కథనం వచ్చింది. ప్రభాస్ దేనిపై ఎక్కువ ఖర్చు చేస్తున్నాడంటూ ఆ పత్రిక ఇంట్రెస్టింగ్ కథనాన్ని ప్రచురించింది.
ప్రభాస్ తన కెరీర్ ద్వారా సంపాదించుకున్న వాటిలో ఆయన ఎక్కువగా ఖర్చు చేసేది కార్లు బంగళాల కోసం కాదట. ఎక్కువగా ఖర్చుపెట్టింది వాలీబాల్ కోర్ట్ కోసమట. ఔట్‌డోర్ స్పోర్ట్స్ కోసం ఓ మైదానాన్ని కొనుగోలు చేశాడట ప్రభాస్. ఓ సాండ్ వాలీబాల్ కోర్ట్‌పైనే ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేశాడని, అది కూడా ఎక్కడో కాదు..
హైదరాబాద్‌లోనే కొన్నాడని పేర్కొంది. ఆ కోర్ట్ కోసం మన బాహుబలి భారీగానే ఖర్చు పెట్టాడని టాక్. అంతే కాదు.. ఎక్కువ సమయాన్ని తన ఫ్రెండ్స్‌తో కలిసి అక్కడే గడుపుతాడని, అక్కడే గేమ్స్ ఆడేస్తాడట.
ఇక, ఫిట్‌నెస్ కోసం ఎక్కువగా జిమ్‌లో కన్నా.. ఇలా ఔట్‌డోర్ స్పోర్ట్స్ ఆడటానికే ఎక్కువగా ఇష్టపడతాడని, అందుకే స్నేహితులతో కలిసి సరదగా గడపడానికి ఈ సాండ్ వాలీబాల్ కోర్టును సొంతం చేసుకున్నాడని చెబుతున్నారు. ఎక్కువగా ఓపెన్ ఎన్విరాన్‌మెంట్లనోనే గడిపేందుకు ప్రభాస్ ఇష్టపడతాడని, ట్రెక్కింగ్ లాంటివి ఎక్కువగా చేస్తుంటాడట. ఇక, పుస్తకాలూ చదివేందుకు ఇష్టపడే ప్రభాస్.. తనకంటూ ఇంట్లో ఓ సొంత లైబ్రరీని ఏర్పాటు చేసుకున్నాడని టాక్. ఇక, వీటితో పాటు రాక్ క్లైంబింగ్‌ను మరింత ఇష్టపడతాడట యంగ్ రెబెల్ స్టార్.