8వేల స్క్రీన్లపై…

262
prabhas still in baahubali 2
prabhas still in baahubali 2
- Advertisement -

‘బాహుబలి’ సినిమా రెండవ భాగం బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ విజువల్‌ వండర్‌ ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టిక్కెట్లు ఎప్పుడెప్పుడు దొరుకుతాయా.. అంటూ భాషలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా బాహుబలి అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదలకు ఇంకో మూడు రోజులు కూడా సమయం లేదు. విడుదలకు సమయం దగ్గర పడేకొద్దీ ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేపుతోంది బాహుబలి టీం. తాజాగా అమరేంద్ర బాహుబలి వస్తున్నాడంటూ బాహుబలి టీం ఈ ఫోటోనే విడుదల చేసింది. రాజసంగా వస్తున్న ప్రభాస్‌.. ఈ లుక్‌లో అదరగొడుతున్నాడు.

prabhas still in baahubali 2

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం దేశ సినీ చరిత్రలో అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతోందని సినీ వర్గాల సమాచారం. వాస్తవానికి దేశవ్యాప్తంగా దాదాపు 6వేల స్కీన్లపై చిత్రాన్ని ప్రదర్శించేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మన దేశంలో దాదాపు 5వేల స్కీన్లలో హిందీ చిత్రాలు ప్రదర్శితమవుతుంటాయి. వీటికి దక్షిణ భారతంలోని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలకు సంబంధించి మరో 3వేల స్క్రీన్లును కూడా కలుపుకొని దాదాపు 8వేల స్క్రీన్లను ఒక్క బాహుబలికే కేటాయించబోతున్నట్లు వూహాగానాలు విన్పిస్తున్నాయి. ఏప్రిల్‌ 28న హిందీతో పాటు మరే భాషలోనూ ఇంకో సినిమా విడుదల కావడంలేదు. దీంతో విడుదలలోనూ రికార్డులు తిరగరాయనున్నాడు బాహుబలి…

- Advertisement -