ఖైది కోసం బాహుబలి..

214
Onliine News Portal
- Advertisement -

ఓ హీరో సినిమా సెట్స్‌కు మరో కథానాయకుడు రావడం, ఒకరినొకరు కలుసుకోవడం చిత్రసీమలో పరిపాటే. కానీ ఓ అగ్ర కథానాయకుడి సెట్స్‌కి మరో స్టార్ హీరో రావడమనేది అరుదుగా జరుగుతుంది. అలాంటి అరుదైన దృశ్యానికి ఖైదీ నంబర్ 150 వేదికగా నిలిచింది. ఇటీవలే ఈ సినిమా సెట్స్‌లో అడుగుపెట్టిన ప్రభాస్ బృందాన్ని చిరంజీవి అభినందించారు.
prabhas
రాజకీయాల నుండి మళ్లీ సినిమాల్లో రీఎంట్రీ ఇస్తున్న మెగాస్టార్‌ ‘ఖైదీ నెంబర్‌ 150’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. తన సినిమా షూటింగ్‌ స్పాట్‌కు తన సన్నిహితులను, మిత్రులను ఆహ్వానిస్తున్నారు మెగాస్టార్‌. ఇక ‘ఖైదీ నం. 150’, ‘బాహుబలి 2’ సినిమాల షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండు సినిమాల షూటింగ్ లొకేషన్ దగ్గర దగ్గరే కావడంతో ఈ స్టార్స్ ఇద్దరూ మీట్ అయ్యారు. షాట్ గ్యాప్‌లో ‘ఖైదీ నం. 150’ లొకేషన్‌కి వెళ్లిన ప్రభాస్, రాజమౌళీలను చిరంజీవి ఆప్యాయంగా ఆహ్వానించారు. రాజమౌళిని, ప్రభాస్‌ను చిరంజీవి ఆత్మీయంగా హత్తుకున్నారు. వారిద్దరూ చిరంజీవితో కొద్దిసేపు మాట్లాడి వెళ్లిపోయారు. ఆ టైమ్‌లో క్లిక్‌మన్న ఫొటో సోషల్ మీడియలో హల్‌చల్ చేస్తోంది.

chiru

- Advertisement -