యస్ యస్ రాజమౌళి ‘బాహుబలి ది బిగినింగ్’తో సంచలనం సృష్టించాడు.ఈ సినిమా దాదాపు రూ. 600 కోట్ల వసూళ్లు సాధించి భారతీయ చలనచిత్ర పరిశ్రమ దృష్టి టాలీవుడ్‌పై పడేలా చేసింది. బాహుబలి:ది కన్‌క్లూజన్ కూడా బాక్సాఫీస్ వద్ద కాసుల సునామీ కురిపిస్తోన్న విషయం తెలిసిందే. భారతీయ సినీ చరిత్రలోని ఎన్నో రికార్డులను బద్దలుకొట్టిన బాహుబలి-2 సినిమా తెలుగు సినిమా స్థాయి ఎటువంటిదో నిరూపించింది.
విడుదలకు ముందు యూ ట్యూబ్‌లో ఉంచిన ట్రైలర్ మొదటి రోజు నుంచే అత్యధిక వ్యూస్ సాధిస్తూ దూసుకుపోతూ వస్తోంది. ఈ రోజు ఈ ట్రైలర్ 150 మిలియన్ల వ్యూస్(15 కోట్లు) దాటేసిందని బాహుబలి-2 టీమ్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. బాహుబలి2 హిందీ ట్రైలర్‌కు 70 మిలయిన్ వ్యూస్ వచ్చాయి. హింది ట్రైలర్లలో బాహుబలిదే టాప్ రికార్డ్. ఈ సినిమాను త్వరలోనే చైనాతో పాటు మరికొన్ని దేశాల్లో విడుదల చేయనున్నారు.
#ThrowbackThursday to the day when #Baahubali2 Trailer released, Thank you all for #150MForBaahubali2Trailer on YouTube alone 🙏🙏 pic.twitter.com/l72QH0zphi
— Baahubali (@BaahubaliMovie) June 29, 2017