ఆరు గంటల్లోనే 76 లక్షలు..

67

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘బాహుబలి 2’ ట్రైలర్‌ అలా వచ్చిందో లేదో ట్రెండింగ్‌లో నిలిచింది. నిమిషాల వ్యవధిలోనే లక్షల మంది వీక్షించడం మొదలైంది.ఈ రోజు ఉద‌యం 10గంట‌ల‌కు విడుద‌లైన ఈ ట్రైల‌ర్ కేవ‌లం ఆరుగంట్లోనే 76 లక్షల మందికి పైగా వీక్షించారు. ట్రైల‌ర్ ద్వారా రాజమౌళి చూపించిన ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు అభిమానులంతా ఫిదా అయిపోతున్నారు. 4కె టెక్నాలజీతో వచ్చిన ఈ ట్రైలర్‌ను వీక్షిస్తుంటే పాత్రలు కళ్లముందే కదలాడుతున్నాయా… అనిపిస్తోందని అభిమానులు అంటున్నారు.

16brk-bahuaa

సినిమాలోని ప్ర‌ధాన పాత్ర‌ల‌న్నింటినీ రాజ‌మౌళి చూపించిన తీరుతో గంట‌గంట‌కీ వ్యూస్ ల‌క్ష‌ల్లో పెరిగిపోతున్నాయి. 2015 జూన్ 1 విడుద‌ల చేసిన‌ ‘బాహుబలి: ది బిగినింగ్‌’ ట్రైలర్ కు ఇప్పటివరకూ కేవలం 78.41లక్షల వ్యూస్ మాత్ర‌మే వ‌చ్చాయి. అయితే, ఆరు గంట‌ల ముందు విడుద‌ల చేసిన‌ ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ ట్రైలర్‌కి మాత్రం 76ల‌క్ష‌ల‌కు మించి వ్యూస్ రావ‌డం విశేషమే.

16brk-bahubb