తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాదు భారతీయ సినీరంగ చరిత్రలో మరే చిత్రానికీ సాధ్యం కాని మహాద్బుతాన్ని రాజమౌళి తీసిన బాహుహలి2 సృష్టించింది. విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం 1500 కోట్ల మార్కుని చేరుకుంది. ఈ విషయాన్ని సినిమా నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా అఫీషియల్ గా ప్రకటించింది. మూడు వారాలలోనే ఈ సినిమా ఆ రికార్డు చేరుకుంది. తొలి ఇండియన్ సినిమాగా రికార్డు సాధించిన ఈ చిత్ర టీం కి ప్రశంసలు లభిస్తున్నాయి.
విడుదలైన అన్ని భాషల్లోను రికార్డులను తిరగరాస్తు బాహుబలి విజయవంతంగా దూసుకుపోతోంది. దేశంలో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన మల్టీప్లెక్స్‌ల్లో రోజుకు 15 నుంచి 20 షోలు నడిచాయి. ప్రదర్శితమవుతున్నాయి. గత పదేళ్లలో ఏ సినిమాకీ లేని విధంగా 96 శాతం ఆక్యుపెన్సీ సాధించి బాహుబలి సత్తాచాటింది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన బాహుబలి ఏకంగా ఒక్కరోజులోనే 200 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.
విడుదలైన 10 రోజుల్లోపే 1000 కోట్ల గ్రాస్ ను సాధించి, అత్యధిక వసూళ్లను రాబట్టిన భారతీయ సినిమాగా చరిత్ర సృష్టించింది.20 రోజుల్లోపే ఈ సినిమా 1500 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తోంది. ఆయా ప్రాంతాల్లో కొత్త సినిమాలు విడుదలవుతున్నా, ‘బాహుబలి 2’ వసూళ్లపై ఎలాంటి ప్రభావం పడకపోవడం విశేషం.
ఏప్రిల్ 28న విడుదలైన ఈ చిత్రం పది రోజుల్లోనే ఇండియాలో రూ. 800 కోట్లు, విదేశాల్లో రూ. 200 కోట్ల కలెక్షన్లను దాటేసిందని, ఈ ఘనత సాధించిన తొలి చిత్రం ఇదేనని విశ్లేషకులు వెల్లడించారు.