ఆల్‌టైమ్ రికార్డ్…

232
baahubali-2-conclusion-worldwide-box-office-collection
- Advertisement -

తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాదు భారతీయ సినీరంగ చరిత్రలో మరే చిత్రానికీ సాధ్యం కాని మహాద్బుతాన్ని రాజమౌళి తీసిన బాహుహలి2 సృష్టించింది. శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన బాహుబలి గతంలో వున్న పలు భారతీయ సినిమా రికార్డుల్ని చెరిపివేస్తూ అఖండ ప్రేక్షకాదరణతో దూసుకుపోతున్నది. భాషా భేదాలతో సంబంధం లేకుండా ఈ చిత్రానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా వెయ్యికోట్ల మైలురాయిని సునాయసంగా అధిగమిస్తుందని సినీ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వారి అంచనాల్ని నిజం చేస్తూ తొలి మూడు రోజుల్లోనే బాహుబలి-2 విశ్వవ్యాప్తంగా దాదాపు 500కోట్లకుపైగా కలెక్షన్లు సాధించి గత రికార్డులన్నింటిని బద్దలు కొట్టింది.

prabhas

మనదేశంలో ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ విడుదలైన అన్ని భాషల్లో కలిపి రూ.385కోట్లు, విదేశాల్లో రూ.120 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ చిత్రం హిందీలో తొలి మూడు రోజులకు రూ.128 కోట్లు రాబట్టింది. దీంతో ‘దంగల్‌’ (రూ.107.01 కోట్లు), సుల్తాన్‌ (రూ.105.53 కోట్లు) రికార్డుల్ని దాటేసింది. చిత్రానికి దక్కుతున్న ఆదరణ పట్ల రాజమౌళి ట్విట్టర్‌లో స్పందించారు. ‘‘బాహుబలి 2’ విడుదలకు కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. అభిమానుల ప్రేమ వాటిని అధిగమించేలా చేసింది. ఐదేళ్ల ‘బాహుబలి’ ప్రయాణంలో ప్రతి దశలోనూ మాకు తోడుగా ఉన్న అభిమానులకు ధన్యవాదాలు. జీవితాంతం మా గుండెల్లో దాచుకునేటంత గొప్ప విజయాన్ని అందించారు’’ అని ట్వీటారు.

Baahubali-2-Review-Baahubali-2-The-Conclusion-Movie-Review-Baahubali-2-Movie-Review

తొలిరోజు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 125కోట్ల వసూళ్లు సాధించి ఆల్‌టైమ్ రికార్డ్ సాధించిన ఈ చిత్రం అదే అప్రతిహత విజయపరంపరను కొనసాగిస్తూ ప్రపంచవ్యాప్తంగా మూడోరోజు 500 కోట్ల కలెక్షన్ల మైలురాయిని దాటింది. తొలి వారాంతంలో బాలీవుడ్ సినిమా రికార్డులన్నింటిని బాహుబలి-2 బ్రేక్ చేసిందని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్‌ఆదర్శ్ వెల్లడించారు.

- Advertisement -