బాహుబలి2కి అంత లేదన్నబాహుబలి రైటర్‌

201
- Advertisement -

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘బాహుబలి 2’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం విజయవంతంగా 75 రోజులు పూర్తి చేసుకొని 100 రోజుల వైపు పరుగులు పెడుతోంది. అయితే భారత సినీ చరిత్రలో కనివినీ ఎరుగని రికార్డులు సృష్టించిన బాహుబలి 2.. అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా రికార్డును బద్దలు కొట్టలేదంటూ బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ అన్నారు.

బాహుబలి-2 నెలకొల్పిన వరల్డ్ వైడ్ వసూళ్ల రికార్డును చైనా కలెక్షన్ల ద్వారా కొన్ని రోజులకే అధిగమించిన సంగతి తెలిసిందే. ఈ సంధర్బంగా విజయేంద్ర ప్రసాద్ ‘దంగల్’పై ప్రశంసలు కురిపించాడు చైనాలో ‘దంగల్’ ఎందుకు అంత బాగా ఆడిందో ఆయన విశ్లేషించాడు.‘‘బాహుబలి-2 చైనాలో విడుదలైనా ‘దంగల్’ వసూళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ దాటదని.. అక్కడ ఈ తరహా పీరియడ్ సినిమాలు చాలానే వస్తుంటాయన్నారు. వాటి మధ్య ‘దంగల్’ భిన్నంగా కనిపించిందని. . అందులోనూ అమ్మాయిలు క్రీడల్లో రాణించి, కుటుంబ బాధ్యత తీసుకుని తమ సత్తా చాటుకోవడమన్నారు.. ఇదే అక్కడి జనాల్ని ఎక్కువగా ఆకట్టుకుందని అనుకుంటున్నాని పేర్కోన్నారు.

క్రీడలకు అత్యంత ప్రాముఖ్యంగా ఉన్న చైనాలో రెజ్లింగ్‌ ముఖ్యం కాదని… అమ్మాయిలు టార్చ్ బేరర్స్ కావడమన్నదే ఇక్కడ సెంటర్ పాయింటన్నారు. అదే చైనా ప్రేక్షకులకు బాగా నచ్చిందని అనుకుంటున్నానని చెప్పారు. అంతేకాదు ‘బాహుబలి-2’ కలెక్షన్లను ‘దంగల్’ దాటినందుకు బాధేమీ లేదని… అది కూడా మన ఇండియన్ సినిమా కావడం సంతోషంగా ఉందన్నారు విజయేంద్ర ప్రసాద్ . బాహుబలి, భజరంగీ భాయ్ జాన్ సినిమాలతో ఒక్కసారిగా నేషనల్ స్టార్ గా మారిపోయాడు కథా రచయిత విజయేంద్ర ప్రసాద్. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలతో పాటు ఇతర దర్శకులకు కూడా కథలు అందిస్తూ బిజీగా ఉన్నాడు విజయేంద్ర ప్రసాద్.

- Advertisement -