లాయర్ ప్రసాద్ మృతి పట్ల వినోద్ కుమార్ సంతాపం..

310
b vinod
- Advertisement -

వరంగల్‌లో ప్రముఖ సీనియర్ న్యాయవాది, మహా మేధావి కే. ఎస్. ఆర్.బీ. ప్రసాద్ మృతి చెందారు. ఆయన పట్ల రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రసాద్ వద్ద జూనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన గత స్మృతులు ఎప్పటికి మరువలేనివని వినోద్ కుమార్ పేర్కొన్నారు. దాదాపు ఆరు దశాబ్దాలుగా న్యాయవాదిగా కొనసాగిన ప్రసాద్ సాహిత్య కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారని వినోద్ కుమార్ గుర్తు చేశారు.

కమ్యూనిస్టు ఉద్యమంలో పాల్గొన్నారని, పుచ్చలపల్లి సుందరయ్య, కొండపల్లి సీతారామయ్య లతో కలిసి జైలు జీవితం అనుభవించిన వ్యక్తి ప్రసాద్ అని ఆయన వివరించారు. పుస్తక పఠనం అంటే ప్రసాద్‌కు ప్రాణం అని గుర్తు చేశారు. వరంగల్ నగరం ఒక మేధావిని కోల్పోయింది అని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమానికి ప్రసాద్ సంపూర్ణ మద్దతు తెలిపారని వినోద్ కుమార్ అన్నారు. ప్రసాద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

- Advertisement -