రైతాంగాన్ని కాపాడే పార్టీ టీఆర్‌ఎస్‌ మాత్రమే: వినోద్

343
B Vinod Kumar Slams Congress and BJP
- Advertisement -

సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా రాష్ట్ర పురపాలక శాఖ చేపట్టిన “ప్రతి ఆదివారం- పది గంటలకు- పదినిమిషాలు” కార్యక్రమంలో ఈరోజు ప్రణాళిక సంఘం చైర్మన్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ ఇందులో భాగంగా వినోద్‌ కుమార్‌ తన నివాసంలోని పూల కుండీలలో చెత్తను తొలగించి తాజా నీటితో నింపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

B Vinod Kumar Slams Congress and BJP

పోతిరెడ్డిపాడు అనే గ్రామం ఉందని అసలు బయటపెట్టింది టిఆర్ఎస్ పార్టీ అన్నారు వినోద్ కుమార్. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుండి కృష్ణానదికి జలాలు తరలించాలని చెప్పిందే ఉద్యమ పార్టీ..టీఆర్‌ఎస్‌ పార్టీ. పోతిరెడ్డిపాడు గురించి ఈ కాంగ్రెస్, బిజెపి మాకు చెబుతుందా అని వినోద్‌ ప్రశ్నించారు.

తాతకు దగ్గులు నేర్పినట్టు ఉందిని ఎద్దేవా చేశారు. ఎన్ని టీఎంసీల నీరు పోతుందని చెప్పిందే టిఆర్ఎస్.నాడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, కీర్తిశేషులు విద్యాసాగర్ రావు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ కలసి చాలా లోతుగా చర్చించి చర్యలు చేపట్టాము. పార్లమెంటులో గళమెత్తి, సెంట్రల్ వాటర్ కమిషన్ వద్ద కంప్లైంట్ చేశాము. తెలంగాణ రైతాంగాన్ని కాపాడే పార్టీ గులాబీ పార్టీ మాత్రమే అని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

- Advertisement -