బీకామ్…జలీల్ ఖాన్ ఫుల్ ఖుషీ

205
B.com means maths and Physics
- Advertisement -

తమకు తెలియని విషయాలకు గురించి ఎక్కువగా మాట్లాడకపోవడమే మంచిది. అది సెలబ్రిటీల విషయానికొస్తే ఇంకాస్త జాగ్రత్తగానే ఉండాలి. ఏ మాత్రం అలసత్వం వహించిన జరగాల్సిన నష్టం ఏ స్దాయిలో ఉంటుందో ఉహించలేం. అలాంటిదే ఓ ప్రజాప్రతినిధి విషయంలో జరిగింది. తనకు తెలియని విషయం గురించి మాట్లాడి ఏపీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఏదేదో మాట్లాడి నవ్వులపాలయ్యాడు. ఆయనే విజయవాడకు చెందిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్. వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన జలీల్ ఖాన్… ఈ ఏడాది టీడీపీ కండువా కప్పుకున్నారు.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను బీ.కాం చదివానని… మ్యాథ్స్, ఫిజిక్స్ ఇంట్రెస్ట్ కాబట్టే ఆ కోర్సు చేశానని వ్యాఖ్యానించాడు జలీల్ ఖాన్. చిన్నతనం నుంచే మ్యాథ్స్‌ జీనియస్‌నని, ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ సబ్జెక్టులతో బీకామ్‌ డిగ్రీ చదివానని ఖాన్‌ చెప్పుకున్నారు. ఎమ్మెల్యేగారి సమాధానంతో అవాక్కైన రిపోర్టర్‌.. ‘బీకామ్‌లో ఫిజిక్స్‌ మ్యాథ్స్‌ ఎక్కడున్నాయండీ..!’ అని ఎదురు ప్రశ్నించినా ఏ మాత్రం తగ్గకుండా తన వాదనను కొనసాగించారు. ‘ఏం? బీకామ్‌లో ఫిజిక్స్‌ లేకపోవడమేంటి? మ్యాథ్స్‌ కూడా ఉంటుందిగా! కావాలంటే నా సర్టిఫికేట్స్‌ చూపిస్తా..’అని జలీల్‌ ఖాన్‌ తన స్టేట్‌మెంట్‌ను సమర్థించుకున్నారు. దీంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.

B.com means maths and Physics

దీంతో ఇప్పుడు జలీల్ ఖాన్ దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయారు. అయితే, దీనిపై వివరణ ఇచ్చిన జలీల్ ఖాన్….నా మాటలను వక్రీకరించారని తెలిపారు. తాను ఇచ్చిన ఇంటర్వ్యూలో వాస్తవాలే చెప్పానని… కానీ, ముందు తాను చెప్పింది డిలీట్ చేసి, తర్వాత చెప్పింది హైలైట్ చేశారని జలీల్ ఖాన్ మండిపడ్డారు. పైచదువులు మీరెందుకు చదవలేదు, ఏం చదవాలనుకున్నారు అనే ప్రశ్నకు బదులుగా… బీకాం చదవాలని అనుకున్నానంటూ చెప్పానని తెలిపారు.

B.com means maths and Physics

గత రెండు మూడు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలన్నింటినీ తాను గమనిస్తున్నానని, తనను ఇంతగా హైలైట్ చేసిన వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని జలీల్ ఖాన్ అన్నారు. తప్పో, ఒప్పో, నేను మాట్లాడిన మాటలతో నేను పాపులర్‌ అయ్యాను. నాకు ఫ్రీ పబ్లిసిటీ దొరికింది. రాజకీయనాయకుడిగా నాకు అంతకంటే కావాల్సింది ఏముంది?’ అని జలీల్‌ ఖాన్‌ ఈ వ్యవహారాన్ని తేలికగా కొట్టిపారేశారు.

https://youtu.be/5gV61N2UpCE

- Advertisement -