నిజామాబాద్ లో క్రికెట్ స్టేడియంః అజారుద్దీన్

373
azaroddin
- Advertisement -

నిజామాబాద్ నగరంలోని గూపన్ పల్లిలో క్రికెట్ స్టేడియాన్ని నిర్మిస్తామన్నారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్. నిజామాబాద్‌ నగరంలోని గూపన్‌పల్లి శివారులో హెచ్‌సీఏ ఆధ్వర్యంలో గతంలో కొనుగోలు చేసిన ఆరెకరాల స్థలాన్ని క్రికెట్‌ మైదానం నిర్మాణం కోసం మంగళవారం హైదరాబాద్‌ నుంచి హెచ్‌సీఏ కమిటీ పరిశీలించింది. రాష్ట్రంలో నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో మాత్రమే హెచ్ సీఏకు సొంతంగా స్ధలాలు ఉన్నాయి.

ఇందులో ముందుగా నిజామాబాద్ లో స్టేడియం నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. గతంలో ఉన్న కమిటీ ఈ స్ధలాన్ని మూడు, నాలుగు సార్లు పరిశిలించినా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇన్ఫ్ స్ట్రక్చర్ డెవలప్ మెంట్ చేసి మరో రెండు నెలల్లో స్టేడియం నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. స్టేడియం నిర్మాణానికి కావాల్సిన పూర్తి సహకారం అందించేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

- Advertisement -