- Advertisement -
భారత మాజీ క్రికెటర్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్‌కు పెను ప్రమాదం తప్పింది. రాజస్థాన్‌లోని సవాయి జిల్లా మధోపుర్‌లో ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అజార్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
ప్రమాదంలో ఆయనకు స్వల్పగాయాలైనట్లు తెలుస్తున్నది.కోటా మెగా హైవేపై అజార్ కారు ఓవర్ టర్న్ అయ్యింది. ఓవర్ టర్న్ కావడం వల్ల కారు బోల్తా పడినట్లు తెలుస్తోంది. సుర్వాల్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
తన కుటుంబంతో కలిసి రణ్‌తంబోర్‌కు అజార్ వెళ్తున్నట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలిసింది. టైరు పేలడం వల్ల అజారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పినట్లు తెలుస్తోంది.
- Advertisement -