ఉద్దేశపూర్వకంగానే నోటీసులు: అజార్

161
hca
- Advertisement -

హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ ఇచ్చిన నోటీసులపై స్పందించారు అధ్యక్షుడు అజారుద్దీన్. ఉద్దేశ పూర్వకంగానే తనకు అపెక్స్ కౌన్సిల్ సభ్యులు నోటీసులు ఇచ్చారని…తానేప్పుడూ హెచ్‌సీఏ గౌరవానికి భంగ కలిగించేలా ప్రవర్తించలేదన్నారు.

అపెక్స్ కౌన్సిల్‌ లో మొత్తం 9 మంది సభ్యులు ఉన్నారని, కేవలం 5గురు సభ్యులు (జాన్ మనోజ్, విజయనంద్, నరేష్ శర్మ, సురేందర్ అగర్వాల్, అనురాధ) ఓ వర్గంగా ఏర్పడి ఇదంతాచేస్తున్నారని మండిపడ్డారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహిస్తే.. ఆ అయిదుగురు సభ్యులు హాజరు కారని అజారుద్దీన్ ఆరోపించారు. ఈ ఐదుగురిపై ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయని మండిపడ్డారు.

వీరి అవినీతికి నేను అడ్డుపడుతున్నాననే ఇలా చేస్తున్నారని…ఈ ఐదుగురే మీటింగ్ పెట్టుకుని.. నాకు నోటీసులు పంపించారని, పైగా ఈ నోటీసులు అపెక్స్ కౌన్సిల్ ఇచ్చినట్టుగా మీడియాకు చెప్పడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.

- Advertisement -