ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్న!

7
- Advertisement -

ఏపీ అసెంబ్లీ సమావేశాలు బుధవారం నుండి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారంతో పాటు స్పీకర్, డిప్యూటీ సీఎం ఎన్నిక జరగనుండగా స్పీకర్ పదవి టీడీపీకి, జనసేనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉంది.

టీడీపీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడి ఎంపిక దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇక డిప్యూటీ సీఎం పదవికి జనసేన నుండి ద్దరు నేతలు పోటీ పడుతున్నారు. ప్రధానంగా బొలిశెట్టి, మండలి బుద్ధప్రసాద్ పేర్లు వినిపిస్తున్నాయి.

మొదట ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ నాయకుడు ఉండనుండగా ఆయన ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. అనంతరం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎంపిక జరుగుతుంది. ఇప్పటికే మంత్రివర్గంలో జనసేనకు సముచిత స్థానం కల్పించారు చంద్రబాబు. పవన్‌కు డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టగా తాజాగా డిప్యూటీ స్పీకర్ పదవి కూడా జనసేనకే కేటాయిస్తున్నట్లు సమాచారం.

Also Read:బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం..

- Advertisement -