- Advertisement -
కేంద్రం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకంతో ఆరోగ్య శ్రీని లింక్ చేయడానికి కమిటీని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. నలుగురు సభ్యులు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాసరావు, వైద్య విద్య డైరెక్టర్ రమేశ్ రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ మనోహర్, వైద్య ఆరోగ్య శాఖ సలహాదారు గంగాధర్‌లతో కమిటీ ఏర్పాటుచేయగా ఆరోగ్య శ్రీలో ప్రైవేటు ఆస్పత్రుల ఎంప్యానెల్‌మెంట్ విధానాన్ని వీరు సమీక్షించనున్నారు.
15 రోజుల్లో కమిటీ నివేదిక ఇవ్వనుండగా నివేదిక వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనుంది సర్కార్. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తొలుత రాష్ట్రంలో అమలు చేసేందుకు ప్రభుత్వం సందేహించిన తర్వాత ఆయుష్మాన్ భారత్‌తో పాటు ఆరోగ్యశ్రీ పథకాన్ని డొవెటైల్ చేయడానికి నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ రెండింటిని అనుసంధానం చేయడానికి కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
- Advertisement -