TTD:ఘనంగా ఆయుధపూజ

5
- Advertisement -

తిరుమల గోగర్భం డ్యామ్ వద్ద టీటీడీ విద్యుత్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం ఆయుధపూజ ఘనంగా జరిగింది. టీటీడీ అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి ఈ కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ స్టేషన్, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర విద్యుత్ పరికరాలకు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఆశాజ్యోతి, డిఇ ఎన్.చంద్ర శేఖర్, డిప్యూటీ ఇంజనీర్ వాణి ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు సోమవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ గా ప్రమాణం చేశాక తొలిసారి ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి ధన్యవాదాలు తెలియజేసి స్వామి వారి ప్రసాదాలు, పుష్పగుచ్చం అందించారు. భక్తులకు స్వామి వారి దర్శనం, అన్నప్రసాదాలు, వసతి సౌకర్యాలపై రాజీ లేకుండా సేవలు అందించాలని ముఖ్య మంత్రి టీటీడీ చైర్మన్ కు సూచించారు.

Also Read:ధూం ధాం…ఎక్స్ లెంట్ రెస్పాన్స్

- Advertisement -