- Advertisement -
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి రేపు భూమిపూజ జరగనుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు భూమిపూజ కార్యక్రమం జరగనుండగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ సహా కేవలం 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం అందించారు.
దాదాపు 10 నిమిషాల పాటు భూమిపూజ కార్యక్రమం జరగనుండగా అయోధ్యలో పారిజాత మొక్కను నాటనున్నారు మోడీ. దాదాపు 3 గంటల పాటు ప్రధాని అయోధ్యలోనే ఉండనుండగా 48 హైటెక్ కెమెరాలతో భూమిపూజ ఈవెంట్‌ను లైవ్ ఇవ్వనున్నారు.
బీజేపీ సీనియర్ నేతలైన ఎల్‌కే అద్వానీ, మురళి మనోహర్ జోషి, న్యాయవాది కె పరాశరన్, ఇతర ప్రముఖులతో చర్చల అనంతరం ఆహ్వాన జాబితా తయారు చేశామని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుండగా కరోనా మహమ్మారి నేపథ్యంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
- Advertisement -