సినీ తారలు ఎప్పటికప్పుడు తమ లైఫ్ స్టైల్‌ను మార్చుకుంటూ అభిమానులకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తుంటారు. ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ద్వారా తమ లెటెస్ట్ ఫోటోలు పెడుతూ ఫ్యాన్స్‌కు మరింత దగ్గరవుతారు. తాజాగా ‘యాప్’ రూపంలో ప్రత్యక్షమవుతున్నారు స్టార్స్..
సినిమా విషయాలు మాత్రమే కాదు.. హెల్త్, ఫిట్‌నెస్, తదితర విషయాలను నటీనటులంతా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్ సెక్స్ బ్యూటీ సన్నీలియోన్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ యాప్ ద్వారా అభిమానులను పలకరిస్తున్నారు. హాలీవుడ్ సెలబ్రిటీలు ఈ యాప్‌కు శ్రీకారం చుట్టారు. ఇక టాలీవుడ్‌లోనూ ఈ యాప్ సందడి చేస్తోంది.
తాజాగా విజయ్ దేవరకొండ కూడా ఇదే బాటలో నడుస్తున్నాడు. విజయ్ దేవరకొండ ఇటీవలే తన అభిమానుల కోసం “రౌడీ” అనే యాప్‌ను లాంచ్ చేశాడు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో విజయ్‌కి మంచి క్రేజ్ లభించింది. తనను అభిమానించే వారికి చేరువగా ఉండాలని విజయ్ యాప్ ను లాచ్ చేశాడు. ఈ యాప్ ద్వారా ఆయన వారానికి ఓ ఫ్యాషన్ స్టైల్‌ను అభిమానుల కోసం లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ భామలు సన్నీలియోన్, సోనమ్ కపూర్, అలియా భట్ “యాప్”లో సందడి చేస్తున్నారు.
తమ సినిమాలు, ఈవెంట్స్, షోస్ గురించి అభిమానులకు సమాచారం ఇస్తూ వారితో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. గత ఏడాది సల్మాన్ ఖాన్ తన 51వ పుట్టిన రోజు సందర్బంగా ఫ్యాన్స్ కు పర్సనల్ యాప్ “బీయింగ్ ఇన్ టచ్” అనే యాప్ ను విడుదల చేశాడు. ఈ యాప్ ద్వారా ఆయన తనకు సంబంధించిన చాలా విషయాలు అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు.