అ..!కు జక్కన్న ప్రశంసలు

208
Awe Official Teaser
- Advertisement -

వాల్‌పోస్ట‌ర్ సినిమా ప‌తాకంపై నాని స‌మ‌ర్పిస్తున్న సినిమా ‘అ!’.  నిత్యా మేన‌న్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, రెజీనా, ఈషా రెబ్బా, అవ‌స‌రాల శ్రీ‌నివాస్ ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.  ఫిబ్రవరి 2న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. నిన్న విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటివరకు 7 లక్షల మంది ఈ టీజర్‌ను చూడగా వేలమంది షేర్ చేశారు.

చేప(నాని), మొక్క(రవితేజ)కు మధ్య జరిగిన సంభాషణలు నవ్వులు పూయించాయి. నాని చేపకు, రవితేజ మొక్కకు వాయిస్‌ ఓవర్ ఇస్తున్నారు.  ‘మీకొక కథ చెప్తా. అనగనగా ఓ రాజు. ఆ రాజుకి ఏడుగురు కొడుకులు. ఆ ఏడుగురూ నాలాంటి ఏడు అమాయక చేపల్ని పట్టుకున్నారు..’ అంటూ ప్రారంభమై…ఈ సినిమాకు కథే హీరో అంటూ ముగిసింది.

దీన్ని చూసిన రాజమౌళి ట్విటర్‌లో స్పందించారు.‘ఫస్ట్‌లుక్‌ నుంచి ఇప్పుడు విడుదలైన టీజర్‌ వరకు అన్ని సినిమాపై ఆసక్తి రేకిత్తిస్తున్నాయి. ‘అ’ద్భుతం..’ అంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. దీంతోపాటు సినిమా టీజర్‌ను అభిమానులతో షేర్‌ చేసుకున్నారు.

- Advertisement -