నేటి రోజుల్లో క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా గుండెపోటు ద్వారా మరణాల రేటు నమోదు అవుతుంటే ఆ తర్వాతి స్థానంలో క్యాన్సర్ ద్వారానే అత్యధికంగా మరణాలు సంభవిస్తున్నాయి. శరీరంలో కణ ప్రవాహంలో మార్పులు సంభవించి కణ సముదాయంగా ఏర్పడడాన్ని క్యాన్సర్ అంటారు. క్యాన్సర్ లో చాలా రకాలే ఉన్నాయి నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, బ్లెడ్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్.. ఇలా చాలా రకాలే ఉన్నాయి. ముఖ్యంగా పొగాకు, ధూమపానం, మద్యపానం, తంబాకు, వంటి వాటితో పాటు ఊబకాయం, ఆహారపు అలవాట్ల కారణంగా వచ్చే కొన్ని రకాల క్యాన్సర్లను నివారించవచ్చు. .
కానీ జన్యుపరమైన కారణాలు, రోగనిరోధక వ్యవస్థలో లోపం వంటి కారణాల వల్ల వచ్చే క్యాన్సర్ లను నివారించడం చాలా కష్టం. దానికితోడు క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తించడం కష్టం.. వ్యాధి ముదిరిన తరువాతే క్యాన్సర్ గా నిర్ధారించడం జరుగుతుంది తద్వారా చాలామంది క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే కొన్ని రకాల జాగ్రత్తలు పాటించడం ద్వారా క్యాన్సర్ ముప్పును తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పొగాకులో దాదాపు 80 రకాల క్యాన్సర్ కారకాలు ఉంటాయట. పొగాకు ద్వారా నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ మాత్రమే కాకుండా అనేక రకాల క్యాన్సర్ లు వచ్చే ప్రమాదం ఉందట.
Also Read:కిరణ్‌కు పెద్ద అభిమానిని: నాగచైతన్య
ప్రస్తుతం పొగాకు వాడడం వల్ల దాదాపు 22 శాతం క్యాన్సర్ మరణాలు సంభవిస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. కాబట్టి ధూమపానం, గుట్కా, వంటి వాటికి దూరంగా ఉందాం చాలా మంచిదట. ఇక మద్యపానం ద్వారా లివర్ క్యాన్సర్, కొలోరెక్టల్, బ్రెస్ట్, గొంతు క్యాన్సర్, అన్నవాహిక.. వంటి ఆరు రకాల క్యాన్సర్లు సంభవిస్తాయట. కాబట్టి మద్యపానం తాగే అలవాటు ఉన్నవారు తప్పనిసరిగా మానుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇక అధిక బరువు వల్ల గర్భాశయం, పమ్కృయాటిక్ క్యాన్సర్, వంటివి సంభవించే ప్రమాదం ఉందట. కాబట్టి బరువు తగ్గడానికి ప్రతిరోజు వ్యాయామం చేయడం ఫుడ్ విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది. అధిక కొవ్వు పదార్థాలు, ఎర్రని మాంసం, ఉప్పు కారం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం.. వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందట. కాబట్టి మనం తినే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు పాటిస్తే క్యాన్సర్ ముప్పు నుంచి తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.