నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక అవార్డు..

8
- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది. భువనేశ్వరికి అవార్డు దక్కడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక ‘డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్-2025’ పురస్కారం దక్కింది.

భారత కాలమానం ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటలకు లండన్‌లోని గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్‌లో అవార్డు అందుకున్నారు భువనేశ్వరి. పురస్కారాన్ని భువనేశ్వరికి అందజేశారు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్(IOD) ప్రతినిధులు.

అదే వేదికపై ఆమెకు చెందిన హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు కూడా ‘ఎక్స్‌లెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్’ విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా చంద్రబాబు హాజరయ్యారు.

Also Read:పహల్గామ్‌లో సినిమా షూటింగ్‌

- Advertisement -