చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించింది అవికా గోర్. ఉయ్యాల జంపాలతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తొలిసినిమాతోనే కుర్రకారు మనసు దోచేసింది. తర్వాత లక్ష్మీ రావే మా ఇంటికి,తను నేను,సినిమా చూపిస్త మావ,ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి హిట్ సినిమాలతో రాణించింది. కానీ ఇవేవి ఈ అమ్మడి కెరీర్‌ని గాడిలో పెట్టలేకపోయాయి.
ఇటు టాలీవుడ్‌లోనూ…అటు బాలీవుడ్‌లోనూ హీరోయిన్‌గా అడుగులు ముందుకువేయలేకపోయింది. ఈ నేపథ్యంలో ఇక సినిమాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం షార్ట్ ఫిల్మ్స్ షూటింగ్లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ససురాల్ సిమర్ కానే సీరియల్‌లో సహనటుడు మనీశ్ రాయ్‌తో కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నారనే వార్తలపై స్పందించింది. మనీష్ తో డేటింగ్ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేసింది.
ఆ సీరియల్ సమయంలో నా వయసు 13. మనీశ్ వయసు 35. అలాంటప్పుడు ఇద్దరి మధ్య ప్రేమ ఎలా కుదురుతుందని ప్రశ్నించింది. ఎవరేం అనుకున్నా నేను, మనీశ్‌మంచి స్నేహితులుగానే ఉంటాం… ఇప్పటికైతే మేమిద్దరం షార్ట్ ఫిల్మ్స్‌తో బిజీగా ఉన్నామని చెప్పుకొచ్చింది. మరి ఈ అమ్మడు క్లారిటీ ఇచ్చిన తర్వాతైన గాసిప్స్‌కు బ్రేక్ పడుతుందో లేదో చూడాలి.