గ్లామర్‌ డోస్‌ పెంచిన అవికా

106
- Advertisement -

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తో బాలనటిగా బుల్లితెరను షేక్‌ చేసి… తర్వాత తెలుగు ఇండస్ట్రీలో ఉయ్యాల జంపాల సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అవికా గోర్‌.. వచ్చిరాగానే మూడు హిట్ సినిమాల్లో నటించి మాంచి జోరుమీదున్న తరుణంలోనే వెంటనే తను నేను, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజుగారి గది సినిమాలతో ప్లాప్‌ ను మూటగట్టుకుంది. ఆ తర్వాత అడపా దడపా సినిమాల్లో నటించినా ఈ అమ్మడికి పెద్దగా అవకాశాలు రాలేదనే చెప్పాలి.. తర్వాత అక్కినేని నాగచైతన్య సరసన థ్యాంక్యూ సినిమాలో నటించినా.. పెద్దగా గుర్తింపురాలేదు.

హోమ్లి బ్యూటీగా నటించిన అవికా గోర్ కు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఛాన్సులు లేవు. దీంతో ఈ అమ్మడు అవకాశాల కోసం తీవ్రంగా శమిస్తున్నట్లు తెలుస్తోంది. అవకాశాల కోసం అందాలు ఆరబోసేందుకు సైతం సిద్ధమవుతుందన్న ప్రచారం జరుగుతోంది. దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్న చందంగా.. అందం ఉన్నప్పుడే చూపించి నాలుగు అవకాశాలు సంపాదించాలి అన్న కోణంలో అవికా గ్లామర్‌ డోస్‌ పెంచేందుకు సైతం సిద్ధంగా ఉందన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు నిండైన తెలుగుదనంతో అచ్చతెలుగు ఆడపడుచులా కనిపించిన అవికా ఇక నుంచి గ్లామర్‌ డోస్‌ పెంచి పొట్టిదుస్తుల్లోనూ మెరిసేందుకు సిద్ధంగా ఉందట. ఎలాంటి పాత్రలోనైనా నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. గ్లామర్‌ డోస్‌ పెంచి గేర్‌ మార్చిన అవికాకు ఇకముందు ఎన్ని అవకాశాలు వస్తాయో చూడాలి.

- Advertisement -