మరోసారి థియేటర్లలోకి అవెంజర్స్!

2
- Advertisement -

మార్వెల్ అభిమానులకు మరోసారి బిగ్ స్క్రీన్‌పై అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు మార్వెల్ స్టూడియోస్ సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’కు ప్రత్యేకమైన ఎంకోర్ ప్రదర్శనగా ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్’ సెప్టెంబర్ 25, 2026న భారతదేశంలోని థియేటర్లలో విడుదల కానుంది.

ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఐమాక్స్ ®తో పాటు మార్వల్ Studios Presents ఇన్ఫినిటీ విజన్ సర్టిఫైడ్ ప్రీమియం లార్జ్ ఫార్మాట్ (PLF) స్క్రీన్స్‌లోనూ ఈ స్పెషల్ ప్రెజెంటేషన్ అందుబాటులో ఉంటుంది. పెద్ద స్క్రీన్స్, మరింత ప్రకాశవంతమైన విజువల్స్, అత్యుత్తమ సౌండ్‌తో ప్రేక్షకులకు మరింత గొప్ప థియేట్రికల్ అనుభూతిని అందించనుంది.

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లోని ఇన్ఫినిటీ సాగాకు మహత్తర ముగింపుగా నిలిచిన ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ను మరోసారి థియేటర్లలో చూసే అవకాశం అభిమానులకు లభించనుంది. అంతేకాకుండా ఈ ఎంకోర్ ప్రెజెంటేషన్‌లో డిసెంబర్ 18, 2026న థియేటర్లలోకి రానున్న అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న *‘అవెంజర్స్: డూమ్స్‌డే’*కు సంబంధించిన ప్రత్యేకమైన స్నీక్ పీక్ కూడా ప్రేక్షకులను అలరించనుంది.

ప్రత్యేకంగా ఐమాక్స్ ® మరియు మార్వల్ స్టూడియోస్ ప్రెజెంట్స్ ఇన్ఫినిటీ విజన్ సర్టిఫైడ్ స్క్రీన్స్‌లో ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్’ను వీక్షించే ప్రేక్షకులకు ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ నుంచి అదనపు ప్రత్యేక స్నీక్ పీక్‌ను చూసే అవకాశం లభిస్తుంది.

‘అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్’లో థానోస్ కారణంగా ప్రపంచ జనాభాలో సగం మంది కనుమరుగైన తర్వాత మిగిలిన సూపర్‌హీరోలు ఎదుర్కొనే పరిస్థితులు, తమ ప్రియమైన వారిని తిరిగి తీసుకురావడానికి వారు చేసే పోరాటం ప్రధానంగా సాగుతుంది. విశ్వంలో శాంతి, సమతుల్యతను పునరుద్ధరించేందుకు అవెంజర్స్ మరోసారి ఏకమై థానోస్‌తో తలపడే మహా సంగ్రామం ప్రేక్షకులకు మరోసారి అద్భుతమైన అనుభూతిని అందించనుంది.

ఈ చిత్రాన్ని కెవిన్ ఫైజీ నిర్మించగా, ఆంథనీ మరియు జో రూసో దర్శకత్వం వహించారు. లూయిస్ డి’ఎస్పొసిటో, విక్టోరియా అలోన్సో, మైఖేల్ గ్రిల్లో, ట్రిన్ ట్రాన్, జాన్ ఫావ్రూ, జేమ్స్ గన్, స్టాన్ లీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు.

Also Read:చిదంబరంకు శివరాజ్‌ కౌంటర్

మార్వెల్ స్టూడియోస్ ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్’ సెప్టెంబర్ 25, 2026 నుంచి భారతదేశంలోని థియేటర్లలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

- Advertisement -