ipl:అవసరమైన ఆటగాళ్లు ఐపీఎల్ ఆడకండి.!

49
- Advertisement -

ఈ యేడాది ప్రపంచకప్‌ సమీపిస్తున్నందున్న అని దేశాల జట్లు తమ ఆటగాళ్లుక సన్నాహాలు మొదలెట్టాయి. అయితే భారత ఆటగాళ్లు మాత్రము గాయాలబారినపడుతుండటంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషభ్ పంత్, వెన్ను నొప్పి గాయం కారణంగా బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ అందుబాటులోకి రావడానికి కనీసం ఐదారు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. మరికిన్ని రోజుల్లో ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత్ మాజీ కోచ్‌ రవిశాస్త్రి భారత ఆటగాళ్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచకప్‌ని దృష్టిలో ఉంచుకొని కీలక ఆటగాళ్ల మ్యాచ్‌ల భారాన్ని తగ్గించాలని అందుకు అవసరమైతే ఆటగాళ్లు ఐపీఎల్ ఆడకూడదని సూచించారు. కీలకమైన ఆటగాళ్లు గాయాల బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. గతంతో పోలిస్తే ఇప్పడు మ్యాచ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయని కానీ అప్పటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పడు అన్ని రకాల సౌకర్యాలు సదుపాయాలు ఉన్నాయన్నారు. ఆటగాళ్లకు ఆటతో పాటు విశ్రాంతి కూడా ముఖ్యమన్నారు. అవసరమైతే ఐపీఎల్ ఆడకుండా చూడాలని బీసీసీఐకి సూచించారు. ఈ విషయంలో ఐపీఎల్ ప్రాంచైజీలతో బీసీసీఐ చర్చించుకోవాలని రవిశాస్త్రి సూచించారు.

ఇవి కూడా చదవండి…

Nikhat Zareen:రెండోసారి ఫైనల్లో నిఖత్

సూర్యకుమార్ చెత్త రికార్డు..

రాయ్‌బరేలి హాకీ స్టేడియంకు రాణి పేరు..

- Advertisement -