- Advertisement -
వైసీపీ అధినేత జగన్‌కు మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీ, పదవులకు రాజీనామా చేసిన ఆయన…తన రాజీనామా లేఖను జగన్‌కు పంపించారు.రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని…వైసీసీని ప్రజలు ఎందుకు తిరస్కరించారో తెలియడం లేదన్నారు. పార్టీలో కార్యకర్తలు, నాయకులకు గౌరవం కొరవడిందన్నారు.
ప్రజాసేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన అవంతి…వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఏ పార్టీలో చేరాలని నిర్ణయించుకోలేదని…. తనకు ఎక్కడ గౌరవం లభిస్తుందని అనుకుంటే అటువైపు వెళ్తానని కీలక వ్యాఖ్యలు చేశారు.
జమిలి ఎన్నికల నేపథ్యంలో ధర్నాలు చేయమంటున్నారని ఇది మంచి పద్దతి కాదని పేర్కొన్నారు.
Also Read:KTR: రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
- Advertisement -