బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి!

6
- Advertisement -

పెట్టుబడులు రావాలంటే స్థిరమైన ప్రభుత్వం ఉండాలన్నారు ఏపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్. వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన శ్రీనివాస్…గత 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ బాగా డెవలప్ అయిందన్నారు. రాష్ట్రం విడిపోతే హైదరాబాద్ నాశనం అవుతుందని మనోళ్ళు అన్నారు కానీ ఉల్టా అయ్యిందన్నారు. హైదరాబాద్ అంత డెవలప్ ఎందుకు అయిందంటే అక్కడ స్థిరమైన ప్రభుత్వం ఉంది కాబట్టి అన్నారు.

ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని వైఎస్ జగన్‌కు అవంతి శ్రీనివాస్ సూచించారు. ఐదేండ్లు పాలించాలని కూటమికి రాష్ట్ర ప్రజలు తీర్పు చెబితే కనీసం ఐదు నెలలు కూడా టైం ఇవ్వకుండా ధర్నాలు అంటే ఎలా అని ప్రశ్నించారు. పార్టీ అంటే ప్రజాస్వామ్య బద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. గత ఐదేండ్లు పార్టీ కార్యకర్తలు నలిగిపోయారన్నారు.

Also Read:అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్‌సేన్

 

- Advertisement -