అవకాడో తింటే ఉపయోగాలే.. కానీ?

48
- Advertisement -

అవకాడో పండు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పండు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని తరచూ ఆరోగ్య నిపుణులు చెబుతూనే ఉంటారు. చూడడానికి జామపండును పోలి ఉండే అవకాడో పండు ఎన్నో పోషకాల సమ్మేళనంగా పరిగణిస్తారు. ఈ పండులో అధిక మొత్తంగా పొటాషియం లభిస్తుంది. ఇంకా ఇందులో విటమిన్ సి కూడా పుష్కలంగా లభిస్తుంది. వీటితో పాటు సోడియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, వంటివి కూడా లభిస్తాయి. అలాగే విటమిన్ బి6, విటమిన్ ఏ.. వంటివి పోషకాలు కూడా అధికమొత్తంలో ఉంటాయి. కాబట్టి ప్రతిరోజూ అవకాడో తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా లివర్ పనితీరు మెరుగుపడుతుంది. కాలేయన్ని టోన్ చేస్తూ పిత్తాశయ రసాలు, గ్యాస్టిక్ రసాలు సక్రమంగా విడుదలయ్యేలా చేస్తుంది. ఇంకా కిడ్నీల సంరక్షణకు కూడా ఎంతో సహాయపడుతుంది.

ఇందులో ఉండే పొటాషియం కిడ్నీ సంబంధిత సమస్యలను దూరం చేసి మూత్రపిండాల శక్తిని పెంచుతాయట. ఇంకా అవకాడోలో ఉండే ఫ్లెవనాయిడ్లు, కెరోటినాయిడ్స్, ఫ్యాటీ ఆల్కహాల్ వంటి సమ్మేళనాలు ఆర్థరైటిస్ సమస్యలను కూడా దూరం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా బరువును తగ్గించడంలోనూ రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ అవకాడో ఎంతగానో ఉపయోగ పడుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే అవకాడో అధికంగా తింటే దుష్ప్రభావాలు తప్పవని చెబుతున్నారు నిపుణులు. ఇందులో పొటాషియం అధికంగా ఉండడం వల్ల ఈ పండ్లను ఎక్కువగా తింటే తలనొప్పి ఏర్పడుతుందట. ఇది కొన్ని సందర్భల్లో మైగ్రీన్ కు కూడా దారితీస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంకా కడుపు ఉబ్బరం, వాంతులను కూడా కలుగజేస్తాయని చెబుతున్నారు. కాబట్టి అవకాడో మితంగా తింటే ఆరోగ్యమే కానీ మితిమీరి తింటే అనారోగ్యం తప్పదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

Also Read:క‌విత జ్యుడీషియ‌ల్ రిమాండ్ పొడిగింపు..

- Advertisement -