మార్చి 1 నుండి ట్రాఫిక్ చలాన్స్‌పై రాయితీ..

130
av ranganath
- Advertisement -

మార్చి 1 నుండి ట్రాఫిక్ చలాన్స్‌ చెల్లింపులపై రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఏవీ రంగనాథ్‌. ఒక నెల వరకు ఈ రాయితీ చెల్లింపు ఉంటుందని…వాహనదారులు అందరూ కోవిడ్ నేపథ్యంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో లోకదాలత్ ద్వారా ఈ రాయితీ కేటాయించామన్నారు. కోవిడ్ మాస్క్ కేసుల్లో 1000రూపాయలకు గాను 100రూపాయలు రాయితీ ఇస్తున్నామన్నారు.

పేదవర్గాలను దృష్టిలో పెట్టుకొని ఈ అవకాశాన్ని వెసులుబాటు కల్పించాం అన్నారు. ప్రతి చాలనును మీ సేవా,ఆన్లైన్ ద్వారా ,తెలంగాణ ఈ చాలాన్ ద్వారా పే చేయవచ్చన్నారు. ఈ అవకాశాన్ని అందరూ వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ట్రాఫిక్ చాలాన్ కట్టుకునే అవకాశం ఉందన్నారు. నెలరోజుల్లో కట్టలేని వారికి మరో వెసులుబాటు కల్పించడాకిని కృషి చేస్తాం అన్నారు.

ప్రజలు ఏదో వేసులు బాటు కల్పించడం వల్ల కఠిన చర్యలు ఉండవని భవించవద్దన్నారు. తద్వారా ట్రాఫిక్ కఠిన నిబంధనలు అమలు అవుతాయని… ఆన్ లైన్ ద్వారానే పెండింగ్ చలాన్ చెల్లించాలన్నారు. ఈ చాలన్ సిస్టమ్ ద్వారా అన్ని పెండింగ్ చలన్ లు చెల్లించాలని…. ద్వి చక్ర వాహనాలకి 25 శాతం రాయితీ ఇస్తున్నామని తెలిపారు. పేద వర్గాలకు వెసుల బాటు ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. హైదరాబాద్ లోనే కేవలం 500 కోట్ల రూపాయల చాలన్ ల వరుకు అనగా 1.75 లక్షల చలనాలు పెండింగ్ లో ఉన్నాయన్నారు.

హైదరాబాద్ సిటీ లో పెర్మిషన్ ఉన్నవి ఉంటే పరవాలేదు.. బయట జిల్లాల నుంచి వచ్చే వాటి పై చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పుడు ఆటో లో మీటర్ వేసే పరిస్థితి లేదని…ఆటో యూనియన్ లకి సమచారం ఇచ్చాం అన్నారు.

- Advertisement -