కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆటో డ్రైవర్ల కు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ JAC ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర వ్యాప్త ఆటో రథ యాత్ర నేటికి ముగిస్తూ ఇందిరా పార్కు కు చేరుకుంది. ఇందులో భాగంగా ఆటో కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆటో కార్మికులు ఇందిరా పార్కు లో ధర్నా నిర్వహించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల కు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేయడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం పై ధ్వజమెత్తారు….ఆటో కార్మికుల ఆకలి కేకలు మహా సభకు ముఖ్య అతిధి లు గా ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య , BMS యూనియన్ కేంద్ర ప్రధాన కార్యదర్శి రవిశంకర్ , ఇతర సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు…
అనంతరం కాంగ్రెస్ పార్టీ తమ 2023 ఎన్నికల మ్యానిఫెస్ట్ లో ఆటో డ్రైవర్ లకు మహాలక్ష్మి పథకానికి ప్రత్యన్యాయం గా సంవత్సరానికి 12 వేల రూపాయలు , ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని నమ్మబలికింది.ఆటో డ్రైవర్ల ఓట్లతో అధికారంలోకి వచ్చింది. సంవత్సరం గడిచిపోయినా కానీ ఇంతవరకు ఆ ప్రస్తావన నే తీయడంలేదు పైగా ఆటో రంగం అన్నా , ఆటో డ్రైవర్ అన్నా ప్రభుత్వానికి చులకన భావం ఉన్నట్లు కనిపిస్తుంది…రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షలకు పైగా ఆటో డ్రైవర్లు ఉన్నాము.భార్య పిల్లలతో కలిసి మొత్తం 30 లక్షల పైన ఓటు బ్యాంకు కలిగి ఉన్నా కాని ఆటో రంగం ఈరోజు నిరాదరణకు గురి అవ్వడం చాలా బాధాకరం..మా కుటుంబాలను రోడ్డున పడేయకండి… దయచేసి మా సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అన్నారు.
Also Read:పాక్‌కు సరైన జవాబిస్తాం:మోదీ

