- Advertisement -
ఓ ఆటో డ్రైవర్‌ని అదృష్టం వరించింది. ఏకంగా రూ. 25 కోట్ల లాటరీని గెలుచుకున్నాడు. కేరళలోని శ్రీవరాహం జిల్లాకు చెందిన ఆటోడ్రైవర్ అనూప్ మలేసియాలో చెఫ్‌గా వెళ్లేందుకు ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే తరచుగా లాటరీ టికెట్లు కొంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుండేవాడు.
గత 22 ఏండ్లుగా కొంటున్నా ఒక్కసారి కూడా లాటరీ తగల్లేదు. అయితే శనివారం ఓ లాటరీ టికెట్ కొన్నారు. ముందో టికెట్ తీసుకున్నా.. నెంబర్ నచ్చలేదని మార్చేసి వేరే టికెట్ తీసుకున్నారు. అంతే అదృష్టం వరించింది. ఏకంగా రూ. 25 కోట్లు గెలుచుకున్నారు. దీంతో ఆ పేద కుటుంబం ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. టికెట్ మార్చేయడమే మంచిదైందని, ఆ నెంబర్‌కు బంపర్ ప్రైజ్ తగిలిందని అనూప్ చెప్పారు.
- Advertisement -