వ్యాక్సిన్‌ తీసుకోని వారికి మాత్రమే లాక్‌డౌన్‌

147
lockdown
- Advertisement -

కొన్ని దేశాల్లో క‌రోనా దాదాపుగా త‌గ్గిపోయినా, కొన్ని చోట్ల త‌గ్గిన‌ట్టు త‌గ్గి మ‌ళ్లీ విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో నిబంధ‌న‌ల‌ను క‌ఠినంగా అమలు చేస్తున్నారు. క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు త‌ప్ప‌నిస‌రిగా టీకాలు తీసుకోవాలి. ప్ర‌తీ దేశంలో టీకాలు వేస్తున్నారు. యూర‌ప్‌లోని ఆస్ట్రియాలో కొత్త నిబంధ‌న‌లు తీసుకొచ్చారు.

ఇప్పటికే ఆ దేశ జ‌నాభాలో 65 శాతం మంది రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకోగా కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో కరోనా కట్టడికి 10 రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్న‌ట్టు ఆ దేశ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. లాక్‌డౌన్ అంద‌రికీ కాదని, ఎవ‌రైతే వ్యాక్సిన్ తీసుకోలేదో వారికి మాత్ర‌మే వ‌ర్తిస్తుంద‌ని, వ్యాక్సిన్ తీసుకోని వ్య‌క్తులు ఇంట్లోనే ఉండాల‌ని, బ‌య‌ట‌కు వ‌స్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చరించింది.

- Advertisement -