మెల్‌బోర్న్ టెస్టు..విజయం దిశగా కోహ్లీ సేన

238
Australia vs India, 3rd Test
- Advertisement -

ఆసీస్ గడ్డపై సిరీస్‌ గెలవాలనే భారత చిరకాల కోరిన నెరవేరబోతోంది. మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భారత్ విజయానికి ఆరు వికెట్ల దూరంలో నిలిచింది.399 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ప్రస్తుతం నాలుగు వికెట్లు కొల్పోయి 116 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 283 పరుగులు చేయాల్సి ఉంది. ఏదైన అద్భుతం జరిగితే తప్ప ఆసీస్ గట్టెక్కడం కష్టం.

సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆసీస్‌కు ఆదిలోనే ఓపెనర్లు అరోన్‌ ఫించ్‌ (3), మార్కస్‌ హర్రీస్‌ (13)ల వికెట్లు కోల్పోయింది. ఫించ్‌ను జడేజా ఔట్‌ చేయగా.. హర్రీస్‌ను బుమ్రా పెవిలియన్‌కు చేర్చాడు. ఉస్మాన్ ఖాజా(33),షాన్ మార్ష్‌(44)పరుగులు చేసి వెనుదిరిగారు. ప్రస్తుతం ట్రావిస్ హెడ్(22),మిచెల్ మార్ష్‌(2) పరుగులతో క్రీజులో ఉన్నారు.

bumra

అంతకముందు ఓవర్ నైట్ స్కోరు 54/5 పరుగులతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన భార‌త్ 8 వికెట్ల న‌ష్టానికి 106 ప‌రుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. భార‌త బ్యాట్స్‌మెన్స్‌లో యువ కెర‌టం మ‌యాంక్ అగ‌ర్వాల్ (42)హ‌య్యెస్ట్ స్కోర‌ర్‌గా నిలిచాడు.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 443/7 డిక్లేర్డ్‌
రెండో ఇన్నింగ్స్‌ 106/8 డిక్లేర్డ్‌
ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ 151 ఆలౌట్‌

shami

- Advertisement -