అసెంబ్లీలో ఆస్ట్రేలియా ప్రజాప్రతినిధుల బృందం

3
- Advertisement -

ఆస్ట్రేలియా దేశానికి చెందిన ప్రజా ప్రతినిధుల బృందం నేడు తెలంగాణ శాసన సభ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ,డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ , పి. ఏ.సి చైర్మన్ అరికేపుడి గాంధీ, లేజిస్లేచర్ సెక్రెటరీ డా” నరసింహా చార్యులు ఆస్ట్రేలియా దేశానికి చెందిన మంత్రులు రిచర్డ్ రీయర్డాన్ , బ్రాండ్ బట్టిన్ గార్లను ఘనంగా సన్మానించారు. శాసన మండలి ఛైర్మన్ ,డిప్యూటీ చైర్మన్ తదితరులు స్వయంగా ఆస్ట్రేలియా ప్రజా ప్రతినిధుల బృందానికి తెలంగాణ శాసన సభ, శాసన మండలి సభ మందిరాలను చూపించి, అన్ని విషయాలను వివరించారు.

ఈ సందర్భంగా ఆస్ట్రేలియా దేశానికి చెందిన మంత్రులు రిచర్డ్ రీయర్డాన్ , బ్రాండ్ బట్టిన్ మాట్లాడుతూ ” తెలంగాణ రాష్ట్ర లేజిస్లేచర్ సభలను చాలా గొప్పగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. లేజిస్లేచర్ కి సంబంధించిన చాలా విషయాలను తెలుసుకున్నమని చెప్పారు. తెలంగాణ రాష్ట్రా శాసన సభ కార్యాలయాన్ని సందర్శించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

Also Read:సీఎం రేవంత్‌కి కేవీపీ లేఖ

- Advertisement -