తెలంగాణ రాష్ట్ర్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ను అస్ట్రేలియాలో పర్యటించాల్సిందిగా అక్కడి ప్రభుత్వం నుంచి ఆహ్వానం వచ్చింది. డిసెంబర్ 5న అస్ర్టేలియాలోని మెల్‌బోర్న్ లో జరిగే ఇండియా లీడర్‌షిప్ సమావేశానికి హజరు కావాల్సిందిగా ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి జూలీ బిషప్ పంపిన ప్రత్యేక అహ్వనం ద్వారా కేటీఆర్‌ను కోరారు. అస్ర్టేలియా ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్ పాల్గొనే ఈ సమావేశంలో కేటీఆర్ ప్రసంగించాల్సిందిగా అస్ర్టేలియా విదేశాంగ శాఖ మంత్రి ఆహ్వానం ద్వారా తెలియజేశారు. ఇండియా, అస్ర్టేలియా దేశం మద్య వ్యాపార వాణిజ్య సంభదాలను పెంచడం లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించనున్నారు.
ఈ సమావేశానికి అస్ర్టేలియా, ఇండియా ఇరుదేశాల నుంచి 50 మంది ప్రముఖ వ్యాపార వేత్తలు, ప్రభుత్వాధినేతలు, పాలసీ మేకర్లను, మేధావులను ప్రత్యేకంగా అహ్వనిస్తారు. ఇరు దేశాల్లోని ప్రభుత్వాల పనితీరు, అర్ధిక పరమైన అంశాలు, వ్యాపార రంగాల్లోని అవకాశాలపైన చర్చించనున్నారు. అలాగే ఈ సమావేశంలో తెలంగాణ రాష్ర్టంలోని ప్రభుత్వ పాలసీలు, వ్యాపారావకాశాలపైన ప్రసంగించాల్సిందిగా మంత్రి కెటి రామారావును అస్ర్టేలియా ప్రభుత్వం కోరింది. తెలంగాణలోని ఐటి రంగం, పరిశ్రామిక పెట్టుబడులు, పట్టణ మౌళిక సదుపాయాల కల్పన వంటి అంశాల్లో భాగస్వాములయ్యేందుకు అస్ర్టేయాలోని వ్యాపార, వాణిజ్య సంస్ధలు ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపారు.
అస్ర్టేలియా పర్యటన సందర్బంగా కేటీఆర్‌కు అస్ర్టేలియా ప్రధానితో సమావేశం ఏర్పాటు చేస్తామని అస్ర్టేలియా హైకమీషన్.. మంత్రికి పంపిన మెయిల్ లో తెలిపింది. అలాగే అస్ర్టేయాలోని తెలుగు కమ్యూనిటితో కలిసేందుకు అవకాశం కల్పిస్తుందని, ఏన్నారై మంత్రిగా ఇతర విషయాలను చర్చించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. దీంతోపాటు అస్ర్టేలియాలోని పలు కంపెనీల సియివోలతో సమావేశం ఉంటుందని, మెల్‌బోర్న్ బయో మెడికల్ పార్క్ పర్యటనతోపాటు.. అస్ర్టేలియా ఐటి శాఖ మంత్రులతో సమావేశం ఉంటుందని తెలిపారు. అస్ట్రేలియా మైనింగ్ పరిశ్రమలతో టియస్ యండిసి తో ప్రత్యేక సమావేశాలుంటాయని హైకమీషన్ తెలిపింది. అస్ర్టేలియా ప్రభుత్వ అహ్వనం పట్ల మంత్రి కెటి రామారావు హర్షం వ్యక్తం చేశారు.