మరోసారి నిరాశపర్చిన రోహిత్

2
- Advertisement -

మెల్ బోర్న్ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా 474 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 3 పరుగులు మాత్రమే చేసి వెనుదిరుగగా కేఎల్ రాహుల్ 24 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో జైస్వాల్, విరాట్ కోహ్లీ ఉన్నారు.

ఇక అంతకముందు ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ 474 పరుగులు చేసి ఆలౌట్ అయింది స్టీవ్ స్మిత్ మూడు సిక్స్‌లు, 13 ఫోర్లతో 140 పరుగులు చేయగా కమిన్స్ 49, కంటాస్ 60,కవాజా 57,లబుషేన్ 72 పరుగులు చేశారు. స్మిత్ కెరీర్‌లో ఇది 34వ సెంచరీ.

భారత బౌలర్లో బుమ్రా నాలుగు వికెట్లు తీయగా జ‌డేజా మూడు, ఆకాశ్ దీప్ రెండు, సుంద‌ర్ ఒక వికెట్ తీశారు.

Also Read:మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కన్నుమూత..

- Advertisement -