వన్డే ప్రపంచకప్‌లో భాగంగా మరో ఆసక్తికర పోరు జరిగింది. న్యూజిలాండ్ – ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో చివరి వరకు పోరాడి ఓడింది న్యూజిలాండ్. 389 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్..5 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. చివరి బాల్ వరకు ఉత్కంఠబరితంగా మ్యాచ్ జరిగింది. కానీ లక్ష్యం భారీగా ఉండటంతో కివీస్ ఓటమి పాలైంది. న్యూజిలాండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 383 పరుగులు చేసి ఓటమి పాలుకాగా రచిన్ రవీంద్ర 89 బంతుల్లో 116, డారిల్ మిషెల్ (54), నీషమ్ 39 బంతుల్లో 58 పరుగులు చేశారు. ముఖ్యంగా భారత సంతతి ఆటగాడు రవీంద్ర సెంచరీతో రాణించి జట్టును గెలిపించే ప్రయత్నం చేసినా విఫలం అయ్యాడు. ఆసీస్ బౌలర్లలో జాంపా 3, కమిన్స్, హజిల్‌వుడ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ 67 బంతుల్లో 109 పరుగులు చేయగా డేవిడ్ వార్నర్ 65 బంతుల్లో 81 పరుగులు చేసి మంచి శుభారంభాన్ని అంందించారు. దీనికి తోడు మిషెల్ మార్ష్ (36), స్మిత్ (18), లబుషేన్ (18) ,మ్యాక్స్‌వెల్ 41, ఇంగ్లిస్ 38 పరుగులు చేశారు. చివర్లో కమిన్స్ 14 బంతుల్లో 37 పరుగులు చేయడంతో భారీ స్కోరు సాధించింది. హెడ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
Also Read:రేవంత్ రెడ్డికి లంబాడీల సత్తా చూపిస్తాం!