క్యారీ ఒంటరిపోరాటం..ఆసీస్ అద్భుత విజయం

65
- Advertisement -

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది ఆస్ట్రేలియా. క్రిస్ట్ చర్చ్ వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ ఆసీస్ విజయం సాధించగా న్యూజిలాండ్ వరుసగా 10వ టెస్టులో ఓటమి పాలైంది. ఓ దశలో ఆసీస్ ఓడిపోతుందనుకుంటున్న క్రమంలో వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ అద్భుత ఇన్నింగ్స్‌తో రాణించాడు. 98 పరుగులతో రాణించగా కమిన్స్ 32 పరుగులతో ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

నాలుగో రోజు 202 ప‌రుగులు అవ‌స‌ర‌మైన ద‌శ‌లో 80 ప‌రుగుల‌కే ఐదు వికెట్లు పడ్డా క్యారీ వెనుకడుగు వేయలేదు. వన్డేలకు ధీటుగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు క్యారీ.

ఈ విజయంతో ఆసీస్ 2-0తో టెస్టు సిరీస్ సొంతం చేసుకుంది. క్యారీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, కివీస్ పేస‌ర్ మ్యాట్ హెన్రీకి ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు ద‌క్కాయి.

Also Read:యాదాద్రి,భద్రాద్రిలో సీఎం ప్రత్యేక పూజలు

- Advertisement -