రాష్ట్రంలో ఆరిజెన్ ఫార్మా భారీ పెట్టుబడి..

62
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రెండ్లీ పారిశ్రామిక పాలసీతో పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. తాజాగా ఆరిజెన్ ఫార్మా సంస్థ గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. దీనిపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్.. జీనోమ్ వ్యాలీలో ఆరిజెన్ ఫార్మా 40 మిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డి పెట్ట‌నుందని…దీనితో 250 మందికి పైగా ఉపాధి కలుగుతుందన్నారు. ప్ర‌పంచ స్థాయి ప్ర‌మాణాల‌తో బ‌యో మ్యానుఫ్యాక్చ‌రింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయ‌నుందని వెల్లడించారు.ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులను అభినందించారు కేటీఆర్.

Also Read:‘దేవ‌ర’ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్

ఈ పెట్టుబడి బయోఫార్మాస్యూటికల్ పరిశోధన మరియు ఉత్పత్తికి ఎంతో దోహదపడుతుందని..హైదరాబాద్‌కు మరిన్ని పెట్టుబడులు వస్తాయని సంతోషం వ్యక్తం చేశారు. ఫార్మా రంగంలో మరింత గణనీయమైన పురోగతిని కొనసాగిస్తామనే నమ్మకం కలిగిందన్నారు కేటీఆర్.

- Advertisement -