ఎన్టీఆర్ కుటుంబానికి అచ్చిరాని ఆగస్టు!

109
- Advertisement -

కొంతమందికి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. అందులో ముఖ్యంగా సినీ హీరోలకు అయితే మరి ఎక్కువగా ఉంటుంది. సినిమా విడుదల దగ్గరి నుండి కొత్త కారు కొన్న దాని నెంబర్ ప్లేట్ వరకు సెంటిమెంట్‌ ఫాలో అయ్యే హీరోలు ఎందరో. అయితే కొంతమందికి ఇది అచ్చిరాగా మరికొంతమందికి మాత్రం అచ్చిరావడం లేదు.

ముఖ్యంగా ఎన్టీఆర్ కుటుంబానికి ఇది అచ్చిరావడం లేదు. ముఖ్యంగా ఆగస్టు నెల అంటేనే ఆ కుటుంబానికి భయం పట్టుకుంది.ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో ఇప్పుడు దీనిపైనే ప్రధానంగా చర్చనడుస్తోంది. ఎన్టీఆర్‌కు ఎనిమిది మంది కుమారులు, నలుగురు కుమార్తెలు. ఎన్టీఆర్ మొదటి కొడుకు రామకృష్ణ పదేళ్ల వయసులోనే మరణించగా మూడో కుమారుడు సాయికృష్ణ కూడా మరణించారు.

తెలుగుదేశం పార్టీకి కూడా ఆగష్టు నెల ఏ మాత్రం కలిసి రాలేదు. . ఆగష్టు 1984లో, నాదెండ్ల భాస్కర్ రావు ఎన్టీఆర్ పై తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు. పార్టీ స్థాపకుడు ఎన్‌టి రామారావు ఆగస్టులో రెండుసార్లు ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు.

ఎన్టీ ఆర్ నాలుగో కుమారుడు నందమూరి హరికృష్ట నెల్లూరు పెళ్లికి వెళ్తూ 2019 ఆగస్టు29న రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇక కళ్యాణ్ రామ్ అన్న నందమూరి జానకిరాం కూడా ఆగస్టులోనే మరణించారు.ఇప్పుడు ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఆగస్టులోనే బలవన్మరణానికి పాల్పడటం చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -