సెలవుల నెలగా ఆగస్టు

194
august as more public holidays
- Advertisement -

ఆగస్టు అరుదైన నెలగా మిగిలిపోతోంది. అత్యధిక సెలవులున్న నెలగా మారుతోంది. ఈ సెలవులను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో యువత విధ్యార్దులు. ప్రయివేటు కంపెనీలలో పని చేసె ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యగులు కూడా ప్లాన్ చేసుకుంటున్నారు.

ఎప్పుడులేని విధంగా తొలిసారి ఐదురోజుల సెలవులు ఒకేసారి వచ్చేశాయి. ఈ శుక్ర‌వారం వ‌ర‌ల‌క్ష్మీవ్ర‌తం. ఆ త‌ర్వాత వీకెండ్‌. మ‌ళ్లీ సోమ‌వారం (ఆగ‌స్ట్ 7) రక్షాబంధ‌న్‌. మ‌ళ్లీ 12, 13 తేదీల్లో వీకెండ్ కాగా.. 14వ తేదీన జ‌న్మాష్ట‌మి, 15న ఇండిపెండెన్స్ డే. అంటే వ‌రుస‌గా నాలుగు రోజులు హాలిడేస్‌. ఇక ఆగ‌స్ట్ 25న అంటే శుక్ర‌వారం వినాయ‌క చ‌వితి. ఆ త‌ర్వాత రెండు రోజులు వీకెండ్‌. సాధార‌ణంగా ఐటీ, బ్యాంకింగ్ (రెండు, నాలుగో శ‌నివారాలు) సెక్టార్ల‌లో ఉన్న వారికి శ‌నివారాలు కూడా హాలిడేసే. ఉద్యోగులు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చాలా ఖుషీగావున్నారు. వీకెండ్‌లో ఇన్ని సెలవు రావడం ఎప్పుడూ చూడలేదని కొందరు చెబుతున్నారు.

వీకెండ్‌కి మహా అంటే ఒకటి రెండు తప్ప… నాలుగు రోజులు లీవ్స్ రావడం నిజమా కలా అంటూ ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఈ సమయంలో షార్ట్ వెకేషన్స్‌కి ఫ్యామిలీలు ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టు నెల హిందువులకు శుభమాసం. శ్రావణమాసం కావడం ఒకటైతే వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం, రక్షాబంధన్ ఇలా రకరకాల పండగులు వచ్చాయి. ఏది ఏమైనా ఇలాంటి సెలవులను ముఖ్యంగా నగరంలో యువత బాగా ఎంజాయి చేస్తారు. ఇంకేముంది ఈ నెలలో వచ్చిన సెలవులను అన్ని రకాల ప్రజలు మరింత ఎంజాయ్ చేసే అవకాశం ఉంది..

- Advertisement -