ఎన్నికల ర్యాలీలో కత్తితో దాడి..

200
Attacker stabs Brazil's right-wing presidential frontrunner
- Advertisement -

బ్రెజిల్‌లో అధ్యక్ష పదవికి అక్టోబర్‌లోఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఓ ఎన్నికల ప్రచారంలో ఉన్న జైర్ బోల్సోనోరోపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. జైర్ బోల్సోనారో.. బ్రెజిల్ అధ్యక్ష పదవి రేసులో ఉన్న అతివాద నేత. ఆయన మద్దతుదారులు భుజాలపై మోసుకెళుతుండగా ఓ వ్యక్తి ముందునుంచి జైర్ బోల్సోనారో కడుపులో పొడిచాడు. దాంతో నొప్పితో బాధపడుతున్న ఆయనను వెంటనే అక్కడి నుంచి తీసుకెళ్లారు.

కాగా..ఈ దాడికి పాల్పడింది 40 ఏళ్ల అడెలియో బిస్పో ఓలివీరా అనే వ్యక్తి. అతన్ని స్థానిక పోలీసులు అరెస్ట్‌ చేశారు. అంతేకాకుండా అనుమానితుడి ఫేస్‌బుక్‌ పేజీ చూస్తే..బోల్సోనారోకు అతడు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్లు తేలింది. అయితే బోల్సోనారోను అక్కడి వాళ్ళు బ్రెజిలియన్ ట్రంప్‌గా అభివర్ణిస్తారు.

తాజాగా బయటకు వచ్చిన సర్వేల్లో బోల్సోనారో విజయం సాధించనున్నట్లు తేలింది. తన ప్రధాన ప్రత్యర్థి, మాజీ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా కంటే పది శాతం ఎక్కువ ఓట్ల మెజార్టీ బోల్సోనారోకు వస్తుందని ఈ సర్వే తేల్చింది. ఈ సర్వేని దృష్టిలో పెట్టుకొనే..బోల్సోనారో పై దాడికి పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే..ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బోల్సోనారో ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు.

- Advertisement -