కొంతకాలంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పిస్తున్న సినీ క్రిటిక్ కత్తి మహేష్‌పై దాడి జరిగింది. ఓ ఛానల్ డిబేట్లో పాల్గొని వెళ్తున్న కత్తి మహేష్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లతో దాడి చేశారు. హైటెక్ సిటీ శిల్పారామం సిగ్నల్ వద్ద ఆగిఉన్న కత్తి కారుపై బైక్ పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు గుడ్లతో దాడి చేసి పరారయ్యారు.
ఒక్కసారిగా ఉహించని పరిణామంతో కత్తి అవాక్కయ్యారు. తనపై దాడి చేసింది పవన్ అభిమానులేనని మహేష్ ఆరోపించారు. తన అభిమానులను అదుపు చేసేందుకు పవన్ కల్యాణ్ ఎలాంటి ప్రకటన చేయలేదని కాబట్టి ఈ దాడికి పవన్ అభిమానులనే బాధ్యులను చేస్తున్నానన్నారు.
మరోవైపు కత్తి మహేశ్‌పై దాడిని ఓయూ జేఏసీ తీవ్రంగా ఖండించింది. ఇవాళ పవన్ కల్యాణ్ దిష్టిబొమ్మలను దహనం చేయనున్నట్లు ఓయూ జేఏసీ తెలిపింది. దళితుడైన కత్తి మహేశ్‌పై దాడి చేయడం అమానుషమని ఇప్పటికైనా పవన్ స్పందించాలని వారు డిమాండ్ చేశారు.